‘ఎమ్మెల్యేల సహకారంతో మార్కెట్‌ అభివృద్ధి’

ABN , First Publish Date - 2021-12-31T19:48:04+05:30 IST

జనగామ వ్యవసాయ మార్కెట్‌ యార్డును ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో అభివృద్ధి చేస్తామని మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బాల్దె విజయ సిద్దిలింగం అన్నారు.

‘ఎమ్మెల్యేల సహకారంతో మార్కెట్‌ అభివృద్ధి’

జనగామ టౌన్‌, డిసెంబరు 30 : జనగామ వ్యవసాయ మార్కెట్‌ యార్డును ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో అభివృద్ధి చేస్తామని మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బాల్దె విజయ సిద్దిలింగం అన్నారు. గురువారం మార్కెట్‌ యార్డులో స్పెషల్‌ గ్రేడ్‌ కార్యదర్శి జి.జీవన్‌కుమార్‌, వైస్‌చైర్మన్‌ ఐలేని ఆగారెడ్డి, డైరక్టర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు యాదగిరిరెడ్డి, రాజయ్యల సహకారంతో నూతన కవర్‌ షెడ్‌ నిర్మాణానికి రూ.80 లక్షలు, కార్యాలయ నిర్మాణానికి రూ.50లక్షల నిధులు,  ట్యాంక్‌ నిర్మాణానికి రూ.20లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మార్కెట్‌ డైరక్టర్లు చిన్నం నర్సింహులు, నూనెముంతల యాకస్వామి, బుషిగంపల ఆంజనేయులు, దండిగ మహేష్‌, రాజు, కె.శంకర్‌, వెంకటేశ్వర్లు, అశోక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T19:48:04+05:30 IST