కోవిడ్ వారియర్స్ కు మద్దతుగా సివిల్ సర్వీస్‌అధికారుల రన్
ABN , First Publish Date - 2021-02-07T00:47:13+05:30 IST
కోవిడ్ వారియర్స్‌కు మద్దతుగా అఖిలభారత సర్వీసు అధికారులు, కేంద్ర సివిల్‌సర్వీసు అధికారులు 5 కి.మీ. మినీ మారథాన్ నిర్వహించారు.

హైదరాబాద్: కోవిడ్ వారియర్స్‌కు మద్దతుగా అఖిలభారత సర్వీసు అధికారులు, కేంద్ర సివిల్‌సర్వీసు అధికారులు 5 కి.మీ. మినీ మారథాన్ నిర్వహించారు. శనివారం ఉదయం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసిహెచ్‌ఆర్‌డి) కార్యాలయం నుంచి ఈ రన్ ప్రారంభించారు. ఎంసిహెచ్‌ఆర్‌డి అడిషనల్ డైరెక్టర్ జనరల్ బెనహర్ మహేశ్ దత్తు ఎక్కా మాట్లాడుతూ ఒక సంవత్సర కాలంగా కోవిడ్ మహమ్మారి ఎదుర్కొని విధులను నిర్వహిస్తున్నడాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసలు సేవలను ఆయన ప్రశంసించారు. ఈ మారథాన్‌లో పాల్గొన్న 121 మంది శిక్షణ పొందుతున్న అధికారులను ఆయన అభినందించారు. ఈ మారధాన్‌లో పాల్గొని గెలుపొందిన వారికి పథకాలను, బహుమతులను అందజేశారు.