మేం లొంగిపోం

ABN , First Publish Date - 2021-07-08T08:31:59+05:30 IST

మావోయిస్టు పార్టీ నేతలెవరూ పోలీసులకు లొంగిపోబోరని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. లొంగిపోతే సహకరిస్తామంటూ తమ

మేం లొంగిపోం

పోలీసుల ప్రతిపాదనను ఖండిస్తున్నాం

మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్‌


హైదరాబాద్‌, జులై 7(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ నేతలెవరూ పోలీసులకు లొంగిపోబోరని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. లొంగిపోతే సహకరిస్తామంటూ తమ కుటుంబసభ్యులను కలిసి పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మల్లోజుల వేణుగోపాల్‌ పేరుతో ‘అడవి నుంచి అమ్మకు లేఖ’ అంటూ ఒక ప్రకటన బుధవారం బయటకు వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి తన తల్లి కి తెలియజేయడానికి ఆ లేఖను విడుదల చేసినట్లు అందులో పేర్కొన్నారు. లొంగిపోవాలని తన తల్లితో రా మగుండం సీపీ సత్యనారాయణ చేసిన ప్రతిపాదినను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. తనతో పాటు అమ్మకు తెలిసిన సత్యనారాయణరెడ్డి, రాంచంద్రారెడ్డి, మల్లా రాజిరెడ్డి, తిరుపతికి కరోనా సోకలేదని వివరించారు. మావోయిస్టు పార్టీలో 15 మందికి మాత్రమే కరోనా సో కిందని, వారిలో చాలా మంది కోలుకున్నారని తెలిపారు.


మొదటి, రెండో వేవ్‌లో పోలీసుల ద్వారానే ఆదివాసీలకు కరోనా అంటుకుందని, గస్తీ ఆపాలని పదే పదే విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదన్నారు. లొంగుబాటుపై పోలీసులు పనికిమాలిన కసరత్తులు చేస్తున్నారని వి మర్శించారు. సమస్యలు చూసి లొంగిపోయేవాళ్లు విప్లవకారులు కారన్నారు. తమ లొంగుబాటును పక్కకు పెట్టి.. కరోనా నియంత్రణ గురించి ఆలోచిస్తే బాగుంటదని కేంద్రప్రభుత్వానికి సూచించారు. ఏదో సాకుతో నిరంతరం పోలీసులు తమ కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం, తమని లొంగిపోవాలని చెప్పడం దశాబ్దాలుగా చూస్తున్నదేనని తెలిపారు. మావోయిస్టులు పోలీసులకు చిక్కగానే కరోనా సోకిందని ప్రచారం చేస్తున్నారని మల్లోజుల వేణుగోపాల్‌ ఆరోపించారు. 

Updated Date - 2021-07-08T08:31:59+05:30 IST