మాణిక్య సోమయాజులు అస్తమయం

ABN , First Publish Date - 2021-08-10T07:38:18+05:30 IST

తెలంగాణలోనే ఏకైక సోమయాజిగా వేల మంది శిష్య పరంపర కలిగిన గురువు విద్వదాహితాగ్ని బ్రహ్మశ్రీ పట్లూరు మాడుగుల మాణిక్య సోమయాజులు(82) సోమవారం సాయంత్రం

మాణిక్య సోమయాజులు అస్తమయం

తెలంగాణలోనే ఏకైక సోమయాజి

ఉదయమే సన్యాసాశ్రమ స్వీకరణ


సంగారెడ్డి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోనే ఏకైక సోమయాజిగా వేల మంది శిష్య పరంపర కలిగిన గురువు విద్వదాహితాగ్ని బ్రహ్మశ్రీ పట్లూరు మాడుగుల మాణిక్య సోమయాజులు(82) సోమవారం సాయంత్రం శివైక్యం చెందారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నివాసముంటున్న సోమయాజులు కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పడుతున్నారు. సోమవారం ఉదయమే ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. తురీయాశ్రమంలో బ్రహ్మనంద తీర్థ స్వామిగా నామకరణాన్ని స్వీకరించి, యోగపట్టా, దండాన్ని ధరించారు. సాయంత్రం ఆయన శివైక్యం చెందారు. కృష్ణ యజుర్వేదాన్ని ఔపోశన పట్టిన ఆయన.. వేదానికి భాష్యం చెప్పారు. ఢిల్లీలో వేదవిద్వాన్‌, వర్గల్‌లో వేదభారతి, తెలంగాణ సభలో ఆచార్య చూడామణి, కరీంనగర్‌లో బ్రాహ్మీభూషణ, హైదరాబాద్‌లో వేద పయోనిధి వంటి బిరుదులు పొందారు.


ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2015లో ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయుత చండీయాగం నిర్వహించిన సందర్భంలో.. మాణిక్య సోమయాజులుకు స్వర్ణ కంకణం తొడిగి, సత్కరించారు. గత ఏడాది చినజీయర్‌ స్వామి ఆయనకు రూ.లక్ష నగదు పురస్కారాన్ని అందజేశారు. సోమయాజులు సుమారు రూ.2.30 కోట్లను విరాళాల రూపంలో సేకరించి, కాశీలో బ్రాహ్మణులకు సదనం కోసం 430 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. 

Updated Date - 2021-08-10T07:38:18+05:30 IST