బీజేపీ, టీఆర్‌ఎస్‌ దొందు దొందే: మాణిక్యం ఠాగూర్‌

ABN , First Publish Date - 2021-08-21T00:24:27+05:30 IST

అధికారమే లక్ష్యంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ జగన్నాటకమాడుతున్నాయని, ఆ రెండు పార్టీలు దొందు దొందేనని టీపీసీసీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్యంఠాగూర్‌ విమర్శించారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ దొందు దొందే: మాణిక్యం ఠాగూర్‌

నాగర్‌కర్నూల్‌: అధికారమే లక్ష్యంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ జగన్నాటకమాడుతున్నాయని, ఆ రెండు పార్టీలు దొందు దొందేనని టీపీసీసీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్యంఠాగూర్‌ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను గద్దెదించేందుకు ప్రజాక్షేత్రంలో అలుపెరగని పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. మోసపూరితమైన వాగ్దానాల్లో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌లు పెట్టింది పేరని వారి కుట్రలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలందరిపై ఉందని చెప్పారు. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాత వచ్చే నెలలో హైదరాబాద్‌లో మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేస్తామని మాణిక్యం ఠాగూర్‌ చెప్పారు.

Updated Date - 2021-08-21T00:24:27+05:30 IST