కేసీఆర్‌ హామీలను దళితులు నమ్మరు: కృష్ణ మాదిగ

ABN , First Publish Date - 2021-08-03T07:31:37+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీలను దళిత సమాజం నమ్మే స్థితిలో లేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.

కేసీఆర్‌ హామీలను దళితులు నమ్మరు: కృష్ణ మాదిగ

వడ్డెపల్లి, ఆగస్టు 2: ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీలను దళిత సమాజం నమ్మే స్థితిలో లేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని ఎస్సీల సమగ్ర అభివృద్ధి సాధన సమితి ఆధ్వర్యంలో హన్మకొండలో సోమవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ పథకం పేరుతో మరోమారు మోసం చేసేందుకు ఆయన కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. దళితుల ఆత్మగౌరవం పెరగాలంటే వారంతా ఆర్థికంగా బలపడాలన్నారు. హుజూరాబాద్‌లో ఈనెల 16లోపే  20 వేల కుటుంబాలకు దళిత బంధును అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దళిత బంధు పథకం సీఎం కేసీఆర్‌ ఎన్నికల ఎత్తుగడేనని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్‌  విమర్శించారు. 

Updated Date - 2021-08-03T07:31:37+05:30 IST