మంత్రి తలసానిని కలిసిన మంచువిష్ణు

ABN , First Publish Date - 2021-10-14T21:32:00+05:30 IST

ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో విజయం సాధించి మా అధ్య అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు, ట్రెజరర్ శివబాలాజీ గురువారం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

మంత్రి తలసానిని కలిసిన మంచువిష్ణు

హైదరాబాద్: ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో విజయం సాధించి మా అధ్య అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు, ట్రెజరర్ శివబాలాజీ గురువారం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.ఈనెల 16 వ తేదీన జరిగే మా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారు మంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంచు విష్ణుకు మంత్రి తలసాని శుభాకాంక్షలు తెలిపారు. సినిమా పరిశ్రమకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.

Updated Date - 2021-10-14T21:32:00+05:30 IST