మంచిర్యాలలో బ్లాక్ ఫంగస్‎తో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-05-30T14:41:25+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనాతో ఇప్పటికే చాలా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లాలో బ్లాక్

మంచిర్యాలలో బ్లాక్ ఫంగస్‎తో వ్యక్తి మృతి

మంచిర్యాల: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనాతో ఇప్పటికే చాలా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. జిల్లాలోని నస్పూర్ కాలనీకి చెందిన సరిత (46) బ్లాక్ ఫంగస్‎తో మృతి చెందింది. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడి...కరోనా నుంచి కోలుకుంది. మరి కొన్ని రోజుల తర్వాత బ్లాక్ ఫంగస్ రావడంతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

Updated Date - 2021-05-30T14:41:25+05:30 IST