మామునూరు పీటీసీలో ఘనంగా దీక్షాంత్ పరేడ్
ABN , First Publish Date - 2021-07-25T05:09:26+05:30 IST
మామునూరు పీటీసీలో ఘనంగా దీక్షాంత్ పరేడ్

అంకిత భావంతో పని చేయాలి
అడిషనల్ డీజీపీ, ట్రైనింగ్ విభాగం ఐజీపీ శ్రీనివాసరావు
మామునూరు, జూలై 24 : సమాజ శ్రేయస్సు కోసం పోలీసులు అంకిత భావంతో పని చేయాలని రాష్ట్ర అడిషనల్ డీజీపీ, ట్రైనింగ్ విభాగంఐజీపీ శ్రీనివాసరావు అన్నారు. వరంగల్ 43వ డివిజన్ మామునూరు పోలీసు శిక్షణ కళాశాల (పీటీసీ)లో శనివారం ప్రిన్సిపాల్ గంగారాం ఆధ్వర్యంలో దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు. కళాశాలలో పోలీసుశాఖలోని టీఎ్‌సఎ్‌సపీ, సివిల్, ఏఆర్, పీటీవో, ఐటీఅండ్‌సీ విభాగాలకు చెందిన 937 మంది పోలీసు కానిస్టేబుళ్ల 9 నెలల శిక్షణ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దీక్షాంత్ పరేడ్‌కు ఆయన ముఖ్యఅథితిగా హాజరయ్యారు. పరేడ్ కమాండర్ మహేష్ నిర్వహణలో అలంకృత వాహనంలో శ్రీనివాసరావు పరేడ్‌ను పరిశీలించారు. కానిస్టేబుల్స్ శిక్షణార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రిన్సిపాల్ గంగారాం శిక్షణార్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరుతున్న పోలీసు కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో సమయ పాలన పాటించాలని సూచించారు. పోలీసు యూనిఫామ్‌ను అవమానపర్చే విధంగా వ్యవహారశైలి ఉండకూడదన్నారు. పోలీసులకు క్రమశిక్షణ పరమావధిగా ఉంటుందని వివరించారు. పోలీసు శాఖలో అనేకరకాల ఉద్యోగాలు భర్తీ జరిగిందని శీనివాసరావు అన్నారు. వచ్చే రోజుల్లో పోలీసు రిక్రూట్మెంట్ జరుగుతుందన్నారు. కరోనా కష్టకాలంలో పోలీసు కానిస్టేబుళ్లకు ఆధునిక శిక్షణ ఇచ్చిన మంచి గుర్తింపు తీసుకు వచ్చారని అన్నారు. శిక్షణలో పతిభ కనపర్చిన శిక్షణార్థులు రజనీకాంత్, మహేష్, షరీఫ్, నాగార్జున, తిరుమల, శైలజకు మోమెంటోలు, బహుమతులు అందజేశారు. శిక్షణకు నిరంతరంగా కృషి చేసిన కళాశాల పోలీసు అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి శ్రీనివాసరావు ప్రశంస పత్రాలు అందజేశారు. పరేడ్‌కు వాక్యతగా ముగ్ధమ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో టీఎ్‌సఎ్‌సపీ ఫోర్త్ బెటాలియన్ కమాండెంట్ వెంకటయ్య, ఐదో బెటాలియన్ కమాండెంట్ ఛటర్జీ, అడిషనల్ ఎస్పీ రాగ్యానాయక్, అడిషనల్ కమాండెంట్లు పాండునాయక్, డీఎ్‌సపీలు శ్రీనివాస్, సుధీర్, భోజరాజు, ఏవో ఫరాన, యూనిట్ మెడికల్ ఆఫీసర్ సుధీర్, ఆర్ఐ చంద్రశేఖర్, ఎస్ఐలు దశరథం, రాజారాం, సుధాకర్, రాజేష్ పాల్గొన్నారు.
