22 నుంచి హేమాచల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2021-05-20T05:37:40+05:30 IST
22 నుంచి హేమాచల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
మంగపేట, మే 19 : ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు హేమచల కొండలపై వెలిసి ఉన్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. 31 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు ఆలయ కార్యనిర్వాహణాధికారి జి.సత్యనారాయణ తెలిపారు. ఉత్సవాల వివరాలను ఆయన బుధవారం వెల్లడించారు. ఈనెల 22న విష్వక్షేనపూజ, భగవత్ పుణ్యావచన. రక్షా బంధనం, అంకురార్పణ, 23న గరుడాధివాసం, 24న ఉదయం ద్వజారోహణం, సుదర్శన హోమం, 25న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎదుర్కోలు, శ్రీ లక్ష్మీ నరసింహ సహస్రనామ పారాయణం, హవనం, 26న మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రధాన ఘట్టమైన తిరుక్కల్యాణ మహోత్సవం, 27న రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు రథోత్సవం, సంక్షిప్త రామాయణ పారాయణం, హవనం, 28న రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు సదస్యం, వేదాశీర్వాచనం, శ్రీహయగ్రీవస్తోత్ర పారాయణం, హవనం, 29న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు తెప్పోత్సవంు, దోపోత్సవం, శ్రీ లక్ష్మి సహస్రనావమ స్తోత్ర పారాయణం, హవనం, 30న, ఉదయం 11 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు మహా పూర్ణాహుతి, పుష్పయాగం, సుదర్శన, నరసింహా హావనం, ఈనెల 31న ఉదయం 11 గంటలకు వసంతోత్సవం ఉంటాయని వివరించారు.
కొవిడ్ నిబంధనల మేరకే..
కొవిడ్ విజృంబిస్తున్న దృష్ట్యా నిబంధనలకు లోబడి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని ఈవో తెలిపారు. ఆలయ ప్రాంగణంలో అంతరాగీకంగా మాత్రమే నిర్వహిస్తున్న పేర్కొన్నారు. భక్తులు అనుమతి ఉండదని ఆయన తెలిపారు.