మల్లారెడ్డి కొవిడ్‌ కేర్‌లో ఉచిత వైద్య సేవలు

ABN , First Publish Date - 2021-05-13T18:41:45+05:30 IST

మల్లారెడ్డి ఆస్పత్రి వారి సౌజన్యంతో మల్లారెడ్డి కొవిడ్‌ కేర్‌లో ఉచిత వైద్య

మల్లారెడ్డి కొవిడ్‌ కేర్‌లో ఉచిత వైద్య సేవలు

హైదరాబాద్/షాపూర్‌నగర్‌ : మల్లారెడ్డి ఆస్పత్రి వారి సౌజన్యంతో మల్లారెడ్డి కొవిడ్‌ కేర్‌లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. స్వల్ప లక్షణాలు కలిగి పాజిటివ్‌ వచ్చిన 15 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఇక్కడ వైద్య సేవలు పొందొచ్చు. 24 గంటలూ డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉంటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం, రా త్రి భోజనం, ఉచితంగా ప్రాథమిక మందులు అందిస్తారు. ఇక్కడ చేరాలంటే ఐసీఎంఆర్‌ ఆమోదిత ల్యాబ్‌ అందించే కొవిడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ ఉండాలి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రవేశం ఉంటుంది. ఆస్పత్రిలో చేరేందుకు హె ల్ప్‌లైన్‌కు కాల్‌ చేయాలనీ, ఆధా ర్‌, ఓటర్‌ ఐడీ గుర్తింపు కార్డులు త ప్పనిసరి అనీ నిర్వాహకులు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-13T18:41:45+05:30 IST