క్రిటికల్ మినరల్స్‌తో “మేక్ ఇన్ ఇండియా”: శైలేంద్ర కుమార్
ABN , First Publish Date - 2021-10-30T00:34:08+05:30 IST
నగరంలో ఎంఈఏఐ జాతీయ సదస్సు జరిగింది. క్రిటికల్

హైదరాబాద్: నగరంలో ఎంఈఏఐ జాతీయ సదస్సు జరిగింది. క్రిటికల్ మినరల్స్‌తో “మేక్ ఇన్ ఇండియా” సాధ్యమని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ రీజినల్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్ శైలేంద్ర కుమార్ అన్నారు. సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తయారీరంగంలో మన దేశం అగ్రగామిగా నిలిచే అవకాశం ఉందన్నారు. దేశ సుస్థిర అభివృద్ధి, ఆర్థిక బలోపేతానికి మైనింగ్ రంగానిదే ముఖ్య భూమిక అని ఆయన పేర్కొన్నారు. ఖనిజాన్వేషణలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని శైలేంద్ర కుమార్ అన్నారు.