తాగుడుకు బానిసై కన్నకూతురిని అమ్మిన రాక్షస తండ్రి
ABN , First Publish Date - 2021-05-21T17:09:49+05:30 IST
తాగుడుకు అలవాటు పడిన ఓ తండ్రి కన్న కూతురిని అమ్మేసాడు.

మహబూబ్‌నగర్: తాగుడుకు అలవాటు పడిన ఓ తండ్రి కన్న కూతురిని అమ్మేసాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన పండ్ల వ్యాపారి రహీం మద్యానికి బానిస అయ్యాడు. అందినకాడికి అప్పులు చేసి తాగేవాడు. ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్న రహీంకు ఇటీవల హైదరాబాద్‌కు చెందిన హఫీజ్ పరిచయమయ్యాడు. అతనికి పిల్లలు లేరని తెలుసుకుని తన 18 నెలల కుమార్తెను అమ్మేసాడు. రూ. 15వేలు తీసుకుని చిన్నారిని హఫీజ్ దగ్గర వదిలిపెట్టాడు. పాప కోసం వెతికిని రహీం భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. రహీం, హఫీజ్‌లను అరెస్టు చేసిన పోలీసులు.. చిన్నారిని శిశు విహార్‌కు తరలించారు.