రామలింగేశ్వర స్వామి ఆలయం నిధుల మళ్లింపుపై భక్తుల ఆగ్రహం
ABN , First Publish Date - 2021-12-19T03:13:01+05:30 IST
మడికొండ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ నిధులు దారి మళ్లింపుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 6.5కోట్ల రూపాయల నిధులను...
హనుమకొండ: మడికొండ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ నిధులు దారి మళ్లింపుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 6.5కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం నిర్మల్‌లో నిర్మిస్తున్న పోచమ్మ గుడికి కేటాయించి జీవో విడుదల చేసింది. దీంతో ప్రభుత్వంపై భక్తులు మండిపడుతున్నారు. ఒక ఆలయం డబ్బులు మరో ఆలాయానికి ఎలా మళ్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు కానుకగా ఇచ్చిన డబ్బులను గుడి అభివృద్ధి వినియోగించాలని డిమాండ్ చేస్తున్నారు.