గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి
ABN , First Publish Date - 2021-12-15T08:07:59+05:30 IST
గవర్నర్ కోటా కింద శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎమ్మెల్సీగా నియమించారు.

గెజిట్ జారీ చేసిన గవర్నర్
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గవర్నర్ కోటా కింద శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎమ్మెల్సీగా నియమించారు. ఈమేరకు మంగళవారం ఆమె గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. దీనిని అనుసరించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయెల్ కూడా అనుబంధ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం మధుసూదనాచారి పదవీ కాలం నియమితులైన రోజు నుంచి ఆరేళ్ల పాటు ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. కాగా, గవర్నర్ కోటా కింద మధుసూదనాచారి ఎమ్మెల్సీగా నియమితులవుతున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ గతంలో ఓ వార్తను ప్రచురించిన విషయం తెలిసిందే.