మాక్‌డ్రిల్ సక్సెస్‌ఫుల్
ABN , First Publish Date - 2021-02-06T05:39:50+05:30 IST
జనగామ మండలం వడ్లకొండ ఏనె చెరువులో శుక్రవారం ఎన్డీఆర్‌ఎ్‌ఫ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన

వడ్లకొండ ఏనె చెరువులో ఎన్డీఆర్‌ఎఫ్ ప్రదర్శనలు
ప్రశంసించిన అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు
ఆసక్తితో తిలకించిన సమీప గ్రామాల ప్రజలు
జనగామ టౌన్, ఫిబ్రవరి 5: జనగామ మండలం వడ్లకొండ ఏనె చెరువులో శుక్రవారం ఎన్డీఆర్‌ఎ్‌ఫ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ డ్రిల్ ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ దామోదర్ సింగ్ టీమ్ ఇన్‌స్పెక్టర్ యోగేష్ కుమార్‌ల ఆఽధ్వర్యంలో 22మంది బృందం సభ్యులు భారీ విపత్తు నిర్వహణ ఏర్పాట్ల మధ్య ప్రదర్శించిన మాక్ డ్రిల్‌ను అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు ప్రారంభించారు.
చెరువు మధ్యలో పడవ ప్రమాదం జరిగితే ప్రయాణికులను రక్షించే విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. బృందం సభ్యులు ప్రత్యేక పడవలతో చెరువు మధ్యలోకి వెళ్లి రక్షణ చర్యలు చేపట్టడం, చెరువులో మునిగిన వ్యక్తులను రక్షించడం, విపత్తు సమయంలో చేపట్టే కార్యక్రమాలు, తదితర అంశాలను స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో ప్రత్యక్షంగా చూపించారు.
ప్రదర్శనలను వడ్లకొండ, పెద్దపహాడ్ పరిసర గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో హాజరై తిలకించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ విపత్తు వేళ అత్యుత్తమ సేవలను అందించే లక్ష్యంగా ఎన్డీఆర్‌ఎఫ్ పనిచేస్తుందన్నారు. సుశిక్షితులైన ఎన్డీఆర్‌ఎఫ్ దళ సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ప్రజలు విపత్తు సమయాలలో ఇలాంటి బృందం సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రమాదాలు జరుగకుండా ప్రజలు అవగాహన, అప్రమత్తతతో ఉండాలన్నారు. విపత్తు సమయాలలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రాణ,ఆస్తి నష్టాన్ని తగ్గించే లక్ష్యంతో పనిచేస్తాయన్నారు. దాదాపు మూడు గంటల పాటు నిర్వహించిన మాక్ డ్రిల్ ప్రదర్శనలు ప్రజలను ఆలోచింపచేశాయి.
కార్యక్రమంలో సీఐ డి.మల్లేశ్ యాదవ్, ఎస్సై రవికుమార్, తహసీల్దార్ రవీందర్, ఆర్‌ఐ ప్రసాద్, సర్పంచ్‌లు బొల్లం శారద, గుండా శ్రీలత శ్రీధర్‌రెడ్డి, మత్స్య అధికారి పి. శ్రీపతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.