‘లక్కీ’ఛాన్స్!
ABN , First Publish Date - 2021-11-21T05:36:40+05:30 IST
‘లక్కీ’ఛాన్స్!

వరంగల్(సంగెం), నవంబరు 20: నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల(వరంగల్ రూరల్ జిల్లా) ఎక్సైజ్ పరిధిలో 63 మద్యం షాపులకు 1,793 దరఖాస్తులు రాగా శనివారం హనుమకొండలోని తారా గార్డెన్‌లో కలెక్టర్ గోపి డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. ఉదయం 11గంటలకు కలెక్టర్ సమక్షంలో దరఖాస్తుదారులను తారా గార్డెన్‌లోకి ప్రత్యేక ఎంట్రీ పాస్ ద్వారా అనుమతించారు. మొదట నర్సంపేట సర్కిల్ పరిధిలోని 25షాపులకు డ్రా తీశారు. అనంతరం పరకాల పరిధిలోని 22 షాపులకు భోజన విరామం తర్వాత వర్ధన్నపేట పరిధిలోని 16షాపులకు కలెక్టర్ లక్కీడ్రా ద్వారా మద్యం వ్యాపారులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ శాఖాధికారి పి.శ్రీనివాస్‌రావు, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ఎక్సైజ్ అధికారులు కరంచంద్, జగన్నాథం, రాజసమ్మయ్య, పవన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాపారుల హల్‌చల్
దరఖాస్తు దారులు ఉదయం 10 గంటల వరకే తారా గార్డెన్‌కు చేరుకున్నారు. కొందరు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి డ్రా కేంద్రానికి చేరుకున్నారు. మహిళల చేత దరఖాస్తులు చేయించిన వారంతా వారిని ప్రత్యేక వాహనాల్లో తీసుకువచ్చారు. కొందరు 20నుంచి ఆపై వరకు దరఖాస్తులు చేసి తమ అదృష్టంను పరీక్షించుకున్నారు.
అంతా ప్రశాంతం..
లక్కీ డ్రా వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 108వాహనం, ఫైర్ ఇంజన్‌లను అందుబాటులో ఉంచారు. గేటు వద్ద ఎంట్రీ పాస్ ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించారు. తారా గార్డెన్ వద్ద పెద్దసంఖ్యలో వాహనాలు రోడ్డు పక్కన నిలిచిపోవడంతో వాహనాదారులు కొంత ఇబ్బంది పడ్డారు. ఖాజీపేట ఏసీపీ శ్రీనివాస్ పలుమార్లు రోడ్డు మీద వాహనాలు నిలిచిపోకుండా పోలీసులతో పాటు వాహనదారులకు సూచనలిచ్చారు.
నర్సంపేట ఎక్సైజ్ పరిధిలో..
షాపు విజేత
1. నర్సంపేట షాపు జి.పైడి
2. నర్సంపేట చిదరాల భిక్షపతి
3. నర్సంపేట గందె శ్రీనివాస్
4. నర్సంపేట పుప్పాల సృజన్‌కుమార్
5. నర్సంపేట పెరుమాండ్ల క్రాంతి
6. నర్సంపేట ఎస్.శ్రీనివాస్‌రెడ్డి
7. నర్సంపేట వడల శ్రీను
8. నర్సంపేట తక్కళ్లపల్లి మనోహర్
9. నర్సంపేట మంచిక మహేష్
10. నలబెల్లి(1) కె.కిరణ్‌గౌడ్
11. నల్లబెల్లి(2) పెండ్యాల కుమారస్వామి
12 నల్లబెల్లి(3) పాలాయి సింధూర
13. నెక్కొండ(1) కామగోని రమేష్
14. నెక్కొండ(2) మడత వెంకట్‌గౌడ్
15. నెక్కొండ(3) మన్నె వాసు
16. నెక్కొండ(4) పొన్నం శ్రీనివాస్
17. ఖానాపురం(1) ఎ.కృష్ణబాయి
18. ఖానాపురం(2) మెరుగు బాబు
19. పాకాల ముంజాల సాయికుమార్
20. చెన్నారావుపేట(1) బుజ్జుగొండ శ్రీనివాస్
21. చెన్నారావుపేట(2) తోట సురేష్
22. చెన్నారావుపేట(3) బొల్లం మధులిత
23. దుగ్గొండి చాడ శైలజ
24. గిర్నిబావి(1) మైలాగాని వనజ
25. గిర్నిబావి(2) వీరబోయిన దేవేందర్
వర్ధన్నపేట ఎక్సైజ్ పరిధిలో..
48. కాపులకనపర్తి దాసరి నళినీకాంత్
49. సంగెం(1) సముద్రాల చంద్రకళ
50. సంగెం(2) వంగ సాంబయ్య
51. వర్ధన్నపేట(1) మేరుగు హరీష్‌గౌడ్
52. వర్ధన్నపేట(2) బొల్లు యాదవరెడ్డి
53. వర్ధన్నపేట(3) గటికె బస్వరాజం
54. ఇల్లంద తాళ్లపల్లి దేవేందర్
55. చింతనెక్కొండ కటకం సునీల్‌కుమార్
56. ఏనుగల్లు ఎం.శంకర్‌రావు
57. పర్వతగిరి(1) ఓల్లం ప్రభుకిరణ్
58. పర్వతగిరి(2) మండల శ్రీధర్
59. రాయపర్తి(1) సోల్తి రాజేందర్‌గౌడ్
60. రాయపర్తి(2) కురుకుల శివ
61. రాయపర్తి(3) వంతలపుల తిరుపతి
62. అన్నారం(1) జాటోతు వాసు
63. అన్నారం(2) కోల సుమన్
వరంగల్ జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాలకు హనుమకొండ అంబేద్కర్ భవన్‌లో శనివారం లక్కీడ్రా తీశారు. హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు.
వరంగల్ జిల్లా కేంద్రంలో...
షాపు/ఏరియా విజేత
1. దేశాయిపేట, కాశీబుగ్గ -1 మాడిశెట్టి ముత్తయ్య
2. దేశాయిపేట, కాశీబుగ్గ -2 దొర్నాల వెంకటేశ్
3. దేశాయిపేట, కాశీబుగ్గ -3 క్యాతం శ్రీలక్ష్మి
4. గిర్మాజీపేట, చార్‌బౌళి - 1 డి.ప్రేమ్‌నంద్
5. గిర్మాజీపేట, చార్‌బౌళి - 2 జె. సతీష్‌కుమార్
6. గిర్మాజీపేట, చార్‌బౌళి - 3 టి. రమ
7. ఎంజీరోడ్, న్యూశాయంపేట- 1 ఎం.రాజు
8. ఎంజీరోడ్, న్యూశాయంపేట -2 జి.శిరీష
9. ఎంజీరోడ్, న్యూశాయంపేట -3 కె. నగేశ్
10. ఎంజీరోడ్, న్యూశాయంపేట -4 బి.అవినాశ్
13. బొల్లికుంట, మామునూరు -1 జె. వేణుగోపాల్
14. బొల్లికుంట, మామునూరు - 2 ఆర్.మల్లారెడ్డి
15. రంగశాయిపేట, శంభునిపేట - 1 షణ్ముఖరెడ్డి
16. రంగశాయిపేట, శంభునిపేట- 2 వి. రవీందర్‌రెడ్డి
17. రంగశాయిపేట, శంభునిపేట- 3 ఎస్. మల్లయ్య
18. శివనగర్, ఫోర్ట్ వరంగల్, కరీమాబాద్ -1 పోతన రాజు
19. శివనగర్, ఫోర్ట్ వరంగల్, కరీమాబాద్ -2 కె. అరుణ
20. శివనగర్, ఫోర్ట్ వరంగల్, కరీమాబాద్ -3 జె. నాగరాజు
21. శివనగర్, ఫోర్ట్ వరంగల్, కరీమాబాద్ -4 ఎన్.శ్రీకాంత్
22. శివనగర్, ఫోర్ట్ వరంగల్, కరీమాబాద్ -5 ఎం.నిఖిత