నష్టాల వల్లే చార్జీల భారం: ట్రాన్స్‌కో సీఎండీ

ABN , First Publish Date - 2021-12-31T08:18:44+05:30 IST

విద్యుత్తు సంస్థల్లో నష్టాలను అధిగమించేందుకే చార్జీలు పెంచాల్సి వస్తోందని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు.

నష్టాల వల్లే చార్జీల భారం: ట్రాన్స్‌కో సీఎండీ

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు సంస్థల్లో నష్టాలను అధిగమించేందుకే చార్జీలు పెంచాల్సి వస్తోందని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. ఏడేళ్ల తర్వాత వినియోగదారులపై భారం వేయాల్సి వచ్చిందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన ఉద్యోగులకు సూచించారు. గురువారం ఆయన తెలంగాణ విద్యుత్తు ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం-2022 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తును అందజేస్తోందన్నారు.

Updated Date - 2021-12-31T08:18:44+05:30 IST