ఆరుగురిని బలిగొన్న లారీ డ్రైవర్ అరెస్టు
ABN , First Publish Date - 2021-02-02T04:38:19+05:30 IST
ఆరుగురిని బలిగొన్న లారీ డ్రైవర్ అరెస్టు

గూడూరు, ఫిబ్రవరి 1 : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద గత నెల 29న ఆటో ను ఢీకొట్టి ఆరుగురి మృతికి కారకుడైన పాటిమీది తండాకు చెందిన లారీ డ్రైవర్ ధారావత్ కిషన్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గూడూరు పోలీ్‌సస్టేషన్‌లో సోమవారం మహబూబాబాద్ ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.వెంకటరమణ వివరాలను వెల్లడించారు. ఎర్రకుంటతండాకు చెందిన జాటోత్ ప్రమీల పెళ్లి దుస్తులు కొనేందుకు ఆమెతో పాటు తల్లి కల్యాణి, సోదరుడు ప్రదీప్, పిన్ని బాబాయి లక్ష్మీ, ప్రసాద్ వరంగల్‌కు ఆటోలో వెళ్తుండగా మర్రిమిట్టలో లారీ డ్రైవర్ కిషన్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా లారీని నడిపి ఢీకొట్టాడు. దీంతో ఆటో డ్రైవర్ జాటోతు రాముతో పాటు అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. కిషన్‌పై 304 11 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, అరెస్టు చేసి కొవిడ్ పరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈసమావేశంలో గూడూరు సీఐ రాజిరెడ్డి, ఎస్సై సతీష్ పాల్గొన్నారు.