లిక్కర్ పేరుతో లూటీ: షర్మిల
ABN , First Publish Date - 2021-12-30T07:50:15+05:30 IST
‘బీజేపీది చీప్ లిక్కర్, టీఆర్‌ఎ్‌సది కాస్ట్‌లీ లిక్కర్ రాజకీయం’ అంటూ

హైదరాబాద్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘బీజేపీది చీప్ లిక్కర్, టీఆర్‌ఎ్‌సది కాస్ట్‌లీ లిక్కర్ రాజకీయం’ అంటూ వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు. లిక్కర్ పేరుతో లూటీ జరుగుతోందని, యువతను లిక్కర్‌కు అలవాటు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల భద్రతను పక్కన పెట్టి మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. చీప్ లిక్కర్‌కు సంబంఽధించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ బుధవారం చేసిన ట్వీట్‌పై షర్మిల ఈ మేరకు స్పందించారు.