ఎక్క‌డిక‌క్క‌డే క‌ట్ట‌డి

ABN , First Publish Date - 2021-05-13T06:04:15+05:30 IST

ఎక్క‌డిక‌క్క‌డే క‌ట్ట‌డి

ఎక్క‌డిక‌క్క‌డే క‌ట్ట‌డి
లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా మారిని భూపాలపల్లి పట్టణం

భూపాలపల్లి జిల్లాలో లాక్‌డౌన్‌ సక్సెస్‌

నిర్ణీత సమయానికి మూతపడిన వ్యాపారాలు

రోడ్లన్నీ నిర్మానుష్యం..  

ప్రధాన రహదారులను దిగ్భందం చేసిన పోలీసులు

కృష్ణకాలనీ (భూపాలపల్లి), మే 12 : భూపాలపల్లి జి ల్లాలో లాక్‌డౌన్‌ సక్సెస్‌ అయ్యింది. తొలిరోజు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారా యి. అత్యవసర సేవలు తప్ప అన్ని మూతపడ్డాయి. వ్యాపార, వాణిజ్య సం స్థలు బంద్‌ పాటించాయి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఇవ్వడంతో నిర్ణీత సమయానికి షాపులను మూసేశారు. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసులు ప్రధాన రహదారులన్నింటినీ పోలీసులు దిగ్భందం చేశారు. అనుమతిలేని వాహనాలను కట్టడి చేశారు. జిల్లా  కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో ఆయా పోలీస్‌ అధికారులు సిబ్బందితో ప్రత్యేక విధులు నిర్వహించారు. స్పెషల్‌ పార్టీ, బ్లూకో ర్ట్స్‌, డయల్‌-100  సిబ్బంది ద్విచక్ర వాహనాలతో గస్తీ నిర్వహించారు. గల్లీలన్నింటినీ చుట్టేసి లాక్‌డౌన్‌ ఉల్లంఘన లేకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.  జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్‌ తీరును అదనపు ఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. డ్రోన్‌ కెమెరా తో పరిస్థితిని వీక్షించారు. అనవసరంగా బయటకు వచ్చిన వారికి పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వాహనాల ఫొటోలు తీసుకొని జరిమానాలు విధించారు. అయితే.. లాఠీలు ఎత్తి న పోలీసులు వాటికి పని చెప్పలేకపోయారని తెలుస్తోంది. ప్రజలెవరినీ కొట్టొద్దని, భయబ్రాంతులకు గురి చేయొద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉండటంతో లాక్‌డౌన్‌ ఉల్లంఘనులను పోలీసులు సున్నితంగానే మందలించి వదిలేశారు.

యధావిధిగా ఇసుక లారీలు 

లాక్‌డౌన్‌ నుంచి ప్రభుత్వం ఇసుక లారీలకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మహాదేవపూర్‌ మండలంలోని ఇసుక క్వారీలకు లారీల రాకపోకలు యధాతథంగా కొనసాగాయి. వందల సంఖ్యలో లారీలు రాకపోకలు సాగించాయి. లారీలు తప్ప రోడ్లపై మరే వాహనాలు కానరాలేదు. కొంత మంది ప్రయాణికులు ఈ లారీల్లోనే తమ గమ్యస్థానాలకు చేరారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకా రం కఠిన చ ర్యలు ఉంటాయని ఏఎస్పీ వి. శ్రీనివాసులు హెచ్చరించారు. ఉద యం 6 నుంచి 10 గంటల వరకు యాధావిధిగా ప్ర జా రవాణా, అన్ని దుకాణ సముదాయాలు తెరిచి ఉంటాయని అన్నారు. ఆ సమయంలో కూడా భౌతికదూరం పాటించకున్నా, మాస్క్‌లు పెట్టకున్నా క్రిమినల్‌ కేసులు తప్పవన్నారు. జిల్లాలో మూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భూపాలపల్లి, కాళేశ్వరం, రేగొండ ప్రాంతాల్లో అవి కొనసాగుతాయన్నారు. 


Updated Date - 2021-05-13T06:04:15+05:30 IST