ములుగులో విజయవంతంగా లాక్డౌన్
ABN , First Publish Date - 2021-05-11T06:14:55+05:30 IST
ములుగులో విజయవంతంగా లాక్డౌన్
ములుగుటౌన్, మే 10 : ములుగు పట్టణంలో సెల్ఫ్ లాక్డౌన్ విజయవంతంగా కొనసాగుతోంది. వర్తక, వ్యాపారులు తీసుకున్న సమష్టి నిర్ణయం మేరకు మే 10 నుంచి మే 25 వరకు ఇది అమలు కానుంది. వ్యాపారులు, పోలీసుల సహకారంతో మొదటి రోజై సోమవారం విజయవంతమైంది. అన్ని రకాల వ్యాపార లావాదేవీలు మధ్యహ్నం 2 గంటలకే మూతపడ్డాయి. దీంతో పట్టణమంతా బోసిపోయింది.