మద్యం షాపులు, పబ్బులకు..వేళల పొడిగింపు దుర్మార్గం
ABN , First Publish Date - 2021-12-30T07:51:09+05:30 IST
ఓ వైపు ఒమైక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుంటే.. మరోవైపు కొత్త

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
హైదరాబాద్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఓ వైపు ఒమైక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుంటే.. మరోవైపు కొత్త సంవత్సరం వేడుకల కోసం మద్యం షాపులు, పబ్బుల వేళల పొడిగింపు దుర్మార్గమని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హన్మంతరావు విమర్శించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రధాని మోదీ మోసం చేశారని.. ఇప్పుడు నిరుద్యోగ సమస్యపై బీజేపీ నేతలు దీక్ష చేయడం హాస్యాస్పదమన్నారు. చేనేత వస్త్రాలపైనా జీఎస్టీని వసూలు చేయడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు.