మాపై నిషేధాన్ని ఎత్తివేయండి
ABN , First Publish Date - 2021-05-13T09:03:25+05:30 IST
తమకు మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయనడంలో వాస్తవం లేదని, తమ సంఘంపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తి వేయాలని తెలంగాణ రైతాంగ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

సీఎస్కు తెలంగాణ రైతాంగ సమితి లేఖ
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): తమకు మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయనడంలో వాస్తవం లేదని, తమ సంఘంపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తి వేయాలని తెలంగాణ రైతాంగ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం సీఎస్ సోమేష్ కుమార్‌కు లేఖ రాసింది. రైతు సమస్యలపై పోరాడుతున్న తమ సంఘంపై నిషేధం విధించడం విడ్డూరంగా ఉందని విమర్శించింది. సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని గుర్తు చేసింది. జీవో 73 తక్షణమే రద్దు చేసి.. నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.