బస్సుల్లో పుట్టిన ఆడపిల్లలకు జీవితకాలం ఉచిత ప్రయాణం
ABN , First Publish Date - 2021-12-09T07:18:33+05:30 IST
బస్సుల్లో పుట్టిన ఇద్దరు ఆడపిల్లలకు జీవితాంతం ఉచితంగా బస్సుల్లో

ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్
హైదరాబాద్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): బస్సుల్లో పుట్టిన ఇద్దరు ఆడపిల్లలకు జీవితాంతం ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించారు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్. నవంబరు 30న నాగర్‌కర్నూల్ డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న సందర్భంగా మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అలాగే డిసెంబరు 7న ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న సందర్భంలో మరో మహిళ సిద్దిపేట సమీపంలో ఆ డపిల్లను ప్రసవించింది. ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ప్రసవానికి సహకరించారు. ఆర్టీసీ సిబ్బంది జాగ్రత్తగా బాలింత, పసిపిల్లలను స మీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చినట్టు అ ధికారులు బుధవారం తెలిపారు.
కాగా బస్సు లో ప్రయాణిస్తూ ప్రసవించడం అరుదైన ఘటనగా పరిగణించి పుట్టిన శిశువులు జీవితకాలం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు.