మాయమాటల టీఆర్‌ఎ్‌సను ఓడిద్దాం

ABN , First Publish Date - 2021-02-26T08:25:24+05:30 IST

నిరుద్యోగులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని వామపక్షాలు బలపర్చిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డి.జయసారథిరెడ్డి విమర్శించారు. హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన

మాయమాటల టీఆర్‌ఎ్‌సను ఓడిద్దాం

వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథిరెడ్డి


వడ్డెపల్లి, ఫిబ్రవరి 25 : నిరుద్యోగులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని వామపక్షాలు బలపర్చిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డి.జయసారథిరెడ్డి విమర్శించారు. హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన ‘మీట్‌ది ప్రెస్‌’లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఆరేళ్లు గడిచినా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా మోసం చేసిందని దుయ్యబట్టారు. ఈ విషయమై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మాయ మాటలతో మోసం చేస్తున్న టీఆర్‌ఎ్‌సను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కోరారు.  జర్నలిస్టుగా అన్ని వర్గాలపై తనకు అవగాహన ఉందని, పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పట్టభద్రులు, ప్రజల హక్కులను సాధించేదుకు శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకనవుతానని విజయసారథిరెడ్డి తెలిపారు. కాగా, ప్రజాసమస్యలపై పోరాడే ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, జయసారథిరెడ్డిలను ఎమ్మెల్సీలుగా గెలిపించాలని టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార ్యదర్శులు జంగయ్య, చావ రవి కోరారు. వీరిద్దరికి తమ సంఘం తరఫున మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-02-26T08:25:24+05:30 IST