ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : అడిషనల్ డీసీపీ
ABN , First Publish Date - 2021-12-31T19:32:51+05:30 IST
రోడ్డు ప్రమాదాల నివారణకు యువత అప్రమత్తంగా ఉండి ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ సాయిచైతన్య అన్నారు.

మామునూరు, డిసెంబరు 30 : రోడ్డు ప్రమాదాల నివారణకు యువత అప్రమత్తంగా ఉండి ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ సాయిచైతన్య అన్నారు. బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం 75వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వారోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ రూల్స్, ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, హెల్మెట్‌ను ధరించాలన్నారు. కార్యక్రమంలో మామునూరు ఏసీపీ నరే్‌షకుమార్, సీఐ రమేష్ కుమార్, ఎస్‌ఐ కృష్ణవేణి పాల్గొన్నారు.