నేడు ఎంసెట్ ఫలితాలు
ABN , First Publish Date - 2021-08-25T08:31:59+05:30 IST
ఎంసెట్ ఫలితాలను నేటి ఉదయం 11 గంటలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జెఎన్‌టియులో విడుదల చేయనున్నారు.

11 గంటలకు విడుదల
వెయిటేజి లేదు.. మార్కుల ఆధారంగానే ర్యాంకులు
హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఎంసెట్ ఫలితాలను నేటి ఉదయం 11 గంటలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జెఎన్‌టియులో విడుదల చేయనున్నారు. ఎంసెట్ ఫలితాల్లో భాగంగా అభ్యర్థులు సాధించిన మార్కులు, వారికి వచ్చిన ర్యాంకులను ప్రకటిస్తారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in అనే వెబ్ సైట్‌లో కూడా చూడొచ్చు. ఈ ఏడాది తరగతులు, పరీక్షలు లేకుండానే ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించినందున ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజిని తొలగించారు. దాంతో ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకులను ఖరారు చేస్తారు. ఈ ఏడాది ఎంసెట్‌లో 70 నుంచి 80 మార్కులు వస్తే 10 వేల ర్యాంకుకు అటూఇటూగా వస్తుందని అంచనా వేస్తున్నారు. 30వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.