ఆస్తిపన్ను చెల్లింపునకు రేపే Last Date

ABN , First Publish Date - 2021-12-30T12:45:26+05:30 IST

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో అర్ధ సంవత్సరం ఆస్తి పన్ను చెల్లింపునకు..

ఆస్తిపన్ను చెల్లింపునకు రేపే Last Date

  • ఒకటి నుంచి రెండు శాతం పెనాల్టీ


హైదరాబాద్‌ సిటీ : 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో అర్ధ సంవత్సరం ఆస్తి పన్ను చెల్లింపునకు రేపు ఆఖరు తేదీ అని జీహెచ్‌ఎంసీ రెవెన్యూ విభాగం వర్గాలు పేర్కొన్నాయి. జనవరి ఒకటి నుంచి పన్నుపై రెండు శాతం పెనాల్టీ విధించనున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆస్తి పన్ను వసూలుపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. దీర్ఘకాలంగా బకాయి ఉన్న వారి నుంచి ఎలాగైనా పన్ను వసూలుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. రెడ్‌ నోటీసులు జారీ చేసినా పన్ను చెల్లించకుంటే రెవెన్యూ రికవరీ యాక్ట్‌ కింద ఆస్తులు సీజ్‌ చేస్తోంది.

Updated Date - 2021-12-30T12:45:26+05:30 IST