వృద్ధురాలి భూ ‘పోరాటం’
ABN , First Publish Date - 2021-05-08T05:51:38+05:30 IST
వృద్ధురాలి భూ ‘పోరాటం’

అయినవారి మోసంతో చేజారిన 13 ఎకరాలు
న్యాయం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్న కాజీపేట తహసిల్దార్
కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్న బాధితురాలు
కాజీపేట, మే 7 : ఇది ఒక అసహాయ వృద్ధురాలి కథ.. అయినావారి మోసంతో వీధిన పడి న్యాయం కోసం ఆక్రో శిస్తున్న ఒంటరి మహిళ వ్యథ.. ‘నా భూమి నాకు ఇప్పిం చండి మహాప్రభో..’ అని ఏళ్ల తరబడి ఆమె అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. జరిగింది పక్కామోసమని తెలిసినా, విచారణలో తేలినా... అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ చోద్యం చూస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థలోని అవి నీతి అక్రమాలను కడిగిపారేసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు చేపడుతున్నా.. అధికారుల తీరు మారడం లేదు. అక్రమార్కులతో కుమ్మక్కై, తెరవెనుక ఒప్పందాలు చేసుకొని బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు. కాజీపేట మండల పరిధిలోని రాంపూర్‌లో 13 ఎకరాల తన సొంత భూమిని కోల్పోయి న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న 70 ఏళ్ల నాయిని అనసూర్య ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఆమె తెలిపిన పూర్వాపరాల మేరకు వివరాల్లోకి వెళ్లితే...
కాజీపేట మండల పరిధిలో రాంపూర్ గ్రామంలో నా యిని వెంకటయ్య, అనసూర్య దంపతులకు సర్వే నెంబర్లు 551ఎ, 578, 592, 584లలో 13 ఎకరాల 8 గుంటల భూమి ఉంది. వీరికి సంతానం లేదు. ఈ క్రమంలో 2011లో వెం కటయ్య బంధువులైన తోపెల ప్రమీల, తోపెల సరోజన 13.08 ఎకరాలపై కన్నేసి గిఫ్ట్ రిజిస్ర్టేషన్‌కు తెరలేపారు. తాము వెంకటయ్య కుమార్తెలమంటూ గిఫ్ట్ డీడ్‌లో పొం దుపరిచి, అమాయకుడైన వెంకటయ్యకు మాయమాటలు చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 2017లో వెంకటయ్య మృతిచెందిన తర్వాత, ఆయన భార్య అనసూర్య భూమిని చదును చేద్దామని వెళ్లగా ప్రమీల, సరోజన పేర గిఫ్ట్ రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిసింది. తమకు అసలు పిల్లలే లేరని, ప్రమీల, సరోజన తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి, తన భర్తను మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని, పట్టాదార్ పాస్‌పుస్తకాలు పొందారని అధికారుల వద్దకు వెళ్లింది.
2019లో సీఎంకు, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసిల్దార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. విచారణ జరపాలని సీఎంవో నుంచి ఆదేశాలు రావడంతో, రిపోర్టు సమర్పిం చాలని ఆర్డీవో.. కాజీపేట తహసీల్దార్ కిరణ్‌కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. తహసిల్దార్ తన విచారణలో నా యిని వెంకటయ్య, అనసూర్య దంపతులకు సంతానం లేర ని ధ్రువీకరించి ఆ మేరకు గత ఏడాది సెప్టెంబర్ 18న ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ కూడా జారీచేశారు. ఈ స ర్టిఫికెట్లో అనసూర్య పేరు ఒక్కటే ఉంది. దీని ఆధారంగా తోపెల ప్రమీల, తోపెల సరోజన మోసానికి పాల్పడిన వి షయం రుజువైనందున వారికి జారీ చేసిన పట్టాదార్ పాస్‌పుస్తకాలు రద్దు చేసి తన పేరును నమోదు చేయా లని విన్నవించింది. విచారణ జరిపి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల నంచి ఆదేశాలు ఉన్నా తహసిల్దార్ వద్ద జాప్యం జరగుతోంది. ప్రమీల, సరోజన లకు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారని అనసూర్య ఆరోపిస్తోంది.
గత నెల 22న ఆర్డీవో వాసుచంద్ర స్వయంగా కాజీపేట తహసిల్దార్‌కు లిఖితపూర్వక లేఖ పంపారని, 7రోజుల్లోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరారని అయినా ఇంత వరకు ఎలాంటి విచారణ జరపలేదని అనసూర్య చెబు తోంది. ఈ వివాదం సివిల్ కోర్టు, ఆర్డీవో ట్రిబ్యునల్, క లెక్టర్ గ్రీవెన్స్ సెల్లో పెండింగ్‌లో ఉండగానే 13.08 ఎకరాల్లో కొంత భాగాన్ని ప్రమీల, సరోజన ఇతరులకు అ మ్ముకోగా, ధరణి పోర్టల్ ద్వారా తహసిల్దార్ కిరణ్‌కుమార్ స్వయంగా రిజిస్ట్రేషన్ చేశారని వివరించింది. ఆయన స్వయంగా విచారణ చేస్తున్న భూమిని ఎలా రిజిస్ర్టేషన్ చేస్తారని ఆమె ప్రశ్నిస్తోంది. వృద్దాప్యంలో ఉన్న తాను గత నాలుగేళ్లుగా తన సొంత భూమి కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని వాపో యింది. తహసిల్దార్ కిరణ్ కుమార్ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని, చివరకు తన ప్రాణం పోయిన తర్వా త చర్యలు తీసుకుంటారా.. అని ఆమె ప్రశ్నిస్తోంది. అర్బన్ జిల్లా కలెక్టర్ చొరవ చూపి తనకు న్యాయం చేయాలని, తప్పుడు పత్రాలతో మోసం చేసిన ప్రమీల, సరోజనలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారి పట్టాదార్ పాస్ పుస్తకాలు రద్దు చేసి, తిరిగి తన పేరును నమోదు చేయా లని ఆమె కోరుతోంది. కాగా, అ న్యాక్రాంతమైన అనసూర్య భూమి విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఎకారానికి కోటి రూపాయలపైనే ఉంటుందని తెలిసింది.