భూనిర్వాసితులకు న్యాయం చేస్తాం

ABN , First Publish Date - 2021-04-13T05:40:34+05:30 IST

భూనిర్వాసితులకు న్యాయం చేస్తాం

భూనిర్వాసితులకు న్యాయం చేస్తాం
మాట్లాడుతున్న సింగరేణి జీఎం నిరీక్షణ్‌రాజు

సింగరేణి జీఎం నిరీక్షణ్‌రాజ్‌

రైతులు, ప్రజాప్రతినిధులతో సమావేశం

ములుగు కలెక్టరేట్‌/వెంకటాపూర్‌(రామప్ప), ఏప్రిల్‌ 12 : ములుగు జిల్లా వెంకటాపూర్‌(రామప్ప) మండల కేంద్రంలో ప్రారంభం కానున్న ఉపరితల గని భూనిర్వాసితులకు న్యాయం చేస్తామని సింగరేణి జనరల్‌ మేనేజర్‌ నిరీక్షణ్‌రాజ్‌ అన్నారు. భూములు కోల్పోతున్న రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులతో  ఆయనతోపాటు ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్‌ మంజుల, ప్రాజెక్టు ఆఫీసర్‌ రఘుపతిరావు సోమవారం ములుగు ఆర్డీవో కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలను సేకరించారు. వెంకటాపూర్‌ మండల కేం ద్రంలో జరిగే కాంట్రాక్టులు, సివిల్‌ టెండర్లు, వెహికిల్‌ లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ పనులు, ఉద్యోగావకాశాలు స్థానికులకే ఇవ్వాలని రైతులు, ప్రజాప్రతినిధులు కోరారు. కోల్పోతున్న భూములకు సంబంధించి పరి హారం ఎంతో రైతులకు తెలియపరిచిన తర్వాతనే సర్వే పనులు ప్రారం భించాలన్నారు. తాళ్లపాడు సెంటర్‌ నుంచి ఉపరితల గని వరకు 3.8 కిలోమీటర్ల దూరం 12.29 ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు అప్పటి ధర ప్రకారం సరైన  పరిహారం అందించలేదన్నారు. వారికి ఇప్పటి ధర ప్రకారం పరిహారం అందించాలని కోరారు. దీనిపై సింగరేణి జీఎం మాట్లాడుతూ స్థానికంగా జరిగే పనులు, సివిల్‌ కాంట్రాక్టులు, లేబర్‌ వర్క్‌ను ఎల్లారెడ్డిపల్లి, వెంకటాపూర్‌ గ్రామాల వారికే కేటాయిస్తా మన్నారు. భూములు కోల్పోయిన వారికి అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సర్వే నంబరు 134లోని భూములపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరగా ఆ సమస్యను కలెక్టర్‌, రెవెన్యూ అధికారులు పరిష్కారిస్తారని అన్నారు. తాళ్ల పాడు సెంటర్‌ నుంచి ప్రారంభమయ్యే రో డ్డుకు సంబంధించిన భూములను 2010 లోనే కొనుగోలు చేసి పరిహారం అందించామని, వారి కి మళ్లీ సొమ్ము ఇచ్చేది లేదని జీఎం తేల్చిచెప్పారు. వారిలో అర్హులైన వారికి నిబం ధనల మేరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. 

దళారులను నమ్మొద్దు  

మండల కేంద్రంలో సింగరేణి ఓపెన్‌కాస్టు పనులు ప్రారంభమవు తున్న నేపథ్యంలో కొంత మంది దళారులు నిరుద్యోగులకు ఆశ చూపు తూ లక్షల్లో డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రాజె క్టు ఆఫీసర్‌ రఘుపతిరావు అన్నారు. ప్రస్తుతం ఫారెస్టు ఎలిమినేషన్‌ అండ్‌ గ్రోత్‌ సర్వే మాత్రమే జరుగుతోందని, దాని కోసం స్థానికులైన వారినే దినసరి కూలీలుగా తీసుకుంటున్నామని, దాని కోసం ఎవరూ దళారులను ఆశ్రయించి మోసపోవద్దని అన్నారు. ఈ పనులు రెండు నెలలు మాత్రమే జరుగుతాయన్నారు. ఆ తర్వాత జరిగే పనులకు నిబంధనల ప్రకారం భూమిని కోల్పోయిన వారికి వారి అర్హతను బట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇతరులకు అవకాశం ఉండదని తేల్చిచెప్పారు. ఈసమావేశంలో స్థానిక సర్పంచ్‌ మేడబోయిన అశోక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కూరెళ్ల రామాచారి, నాయకులు చింతిరెడ్డి ప్రసాద్‌రెడ్డి, పోశాల వీరమ ల్లు, సాద యాదగిరి, రైతులు సుధాకర్‌రావు, కొంపెల్లి రవీందర్‌రెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-13T05:40:34+05:30 IST