ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-10-29T05:04:24+05:30 IST

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి
ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లతో ప్రతిజ్ఞ చేయిస్తున్న వీసీ రమేష్‌

కేయూ వీసీ ప్రొఫెసర్‌ రమేష్‌


నర్సంపేట టౌన్‌, అక్టోబరు  28 : ఆరోగ్యవంత మైన సమాజ నిర్మాణానికి యువత కృషి చేయాలని కేయూ వీసీ ప్రొఫెసర్‌ తాటికొండ రమేష్‌ అన్నారు. నర్సంపేటలో గురువారం కేయూ ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వ ర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లతో స్వచ్ఛతా అవగాహన ర్యాలీని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.చంద్రమౌళి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా  కేయూ వీసీ తాటికొండ  రమేష్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో పరిశుభ్రత పాటించేలా ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు ప్రజలను  చైతన్యపర్చాల న్నారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని తెలిపారు. కేయూ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఈసం నారాయణ మాట్లాడుతూ స్వచ్ఛత సాధించడానికి వలంటీర్లు నిబద్ధతతో కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీపీవో జి.శ్రీనివాస్‌, ఐఎంఏ అధ్యక్షుడు లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, సిద్ధార్థ, ఆచార్య డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ గోగుల ప్రభాకర్‌రెడ్డి, జీజుల సాగర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవోలు జి.అశోక్‌, పెండెం రాజేష్‌, అశ్విన్‌, సాంబరాజు రాజు, రమేష్‌, వలంటీర్లు పాల్గొన్నారు. ట

Updated Date - 2021-10-29T05:04:24+05:30 IST