రేపటి నుంచి కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు

ABN , First Publish Date - 2021-10-25T06:11:03+05:30 IST

రేపటి నుంచి కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు

రేపటి నుంచి కాకతీయ యూనివర్సిటీ  దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు

హాజరుకానున్న 32,318 మంది విద్యార్థులు

కేయూ క్యాంపస్‌, అక్టోబరు 24: కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం డిగ్రీ మొదటి, రెండో ఏడాది, పీజీ మొదటి ఏడాది పరీక్షలు అక్టోబరు 26 నుంచి ప్రారంభం  కానున్నాయి. వర్సిటీ పరిధిలో బీఏ, బీకాం, బీఎస్పీ, బీబీఎం ఇతర డిగ్రీ కోర్సుల్లో పరీక్షలకు  కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫసర్‌ పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారి డాక్టర్‌ వై.వెంకయ్యలు ఆదివారం తెలిపారు. యూజీ మొదటి ఏడాదిలో అన్ని గ్రూపుల్లో 17,706 మంది, రెండో ఏడాదిలో 8443మంది, పీజీ గ్రూపుల్లో 6169 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలు మఽధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. ఇతర వివరాల కోసం దూరవిద్య కేంద్రం వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు.

 

Updated Date - 2021-10-25T06:11:03+05:30 IST