కేయూ డిగ్రీ ఫలితాల వెల్లడి

ABN , First Publish Date - 2021-01-21T04:08:24+05:30 IST

కేయూ డిగ్రీ ఫలితాల వెల్లడి

కేయూ డిగ్రీ ఫలితాల వెల్లడి

కేయూ క్యాంపస్‌, జనవరి 20: కేయూ ఇయర్‌ వైజ్‌ స్కీమ్‌ డిగ్రీ పరీక్షల ఫలితాలను బుధవారం కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ ఎస్‌.మహేందర్‌రెడ్డి తన చాంబర్‌లో విడుదల చేశారు. గత డిసెంబరులో నిర్వహించిన డిగ్రీ మొదటి, రెండు, మూడో ఏడాది పరీక్షల్లో మొత్తం 16,059 మంది విద్యార్థులు హాజరు కాగా 9,604 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. 59.8శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వివరించారు. ఫలితాలను కేయూ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపారు. ఈనెల 28 వరకు రీవాల్యూయేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. అదనపు పరీక్షల నియంత్రణాధికారులు వై.వెంకయ్య, పి.సదానందం, ఏఆర్‌ రామా వెంకటేశ్వర్లు, ఇ.సురేశ్‌బాబు, క్యాంపు ఆఫీసర్లు వి.కృష్ణమాచార్యలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T04:08:24+05:30 IST