టీఆర్‌ఎస్ ద్వి దశాబ్ది ఉత్సవాలను.. ఘనంగా నిర్వహించుకుందాం
ABN , First Publish Date - 2021-10-21T09:20:27+05:30 IST
తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి మననం చేసుకుంటూ టీఆర్‌ఎస్ ద్వి దశాబ్ది ఉత్సవాలను..
పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలి: కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి మననం చేసుకుంటూ టీఆర్‌ఎస్ ద్వి దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని కేటీఆర్ అన్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలంటూ పిలుపునిచ్చారు. పార్టీ ప్లీనరీ, వరంగల్ విజయగర్జన సభకు సంబంధించి బుధవారం మేడ్చల్, రంగారెడ్డి, ఖమ్మం, భద్రాచలం జిల్లాలకు చెందిన 20 నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గ్రామ, వార్డు, డివిజన్ స్థాయిలో ఉన్న ప్రతి యూనిట్ నుంచి భారీగా కార్యకర్తలు సభకు తరలి రావాల్సి ఉంటుందన్నారు. ఈనెల 25న జరిగే పార్టీ ప్లీనరీ సమావేశానికి ప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానం అందుతుందని ఆయన చెప్పారు.