పుట్టినరోజు సందర్భంగా మొక్క నాటిన హిమాన్షు

ABN , First Publish Date - 2021-07-12T18:15:18+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు పుట్టినరోజు నేడు(జులై 12). ఈ సందర్భంగా హిమాన్షు మొక్క నాటాడు.

పుట్టినరోజు సందర్భంగా మొక్క నాటిన హిమాన్షు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు పుట్టినరోజు నేడు(జులై 12). ఈ సందర్భంగా హిమాన్షు మొక్క నాటాడు. ఈ విషయాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘ప్రతి వ్యక్తి జీవితంలోనూ రెండు గొప్ప రోజులు ఉంటాయి. అందులో ఒకటి పుట్టినరోజు కాగా, రెండోది ఎందుకు పుట్టామో తెలుసుకునే రోజు’’ అంటూ స్కాటిష్ రచయిత విలియం బార్క్‌లే చెప్పిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. డయానా అవార్డు విజేత హిమాన్షు తన పుట్టినరోజు సందర్భంగా మొక్కను నాటుతానంటూ తనని అడిగినట్లు సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. 


ఇక తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన విషయాన్ని హిమాన్షు కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ‘‘నా పుట్టినరోజు సందర్భంగా నేను రెండు మొక్కలు నాటాను. సంతోష్ కుమార్ బాబాయ్ ఆధ్వర్యంలోని గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరితహారం కార్యక్రమాల్లో భాగం కావడం సంతోషంగా ఉంది.’’ అంటూ హిమాన్షు ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

Updated Date - 2021-07-12T18:15:18+05:30 IST