7 కంపెనీలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ABN , First Publish Date - 2021-12-16T01:00:09+05:30 IST
జిల్లాలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజ్ పార్క్‌లో 7 కంపెనీలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశంలో మెడికల్ డివైజ్‌లను 78 శాతం ఇతర దేశాల నుండి దిగుబడి చేసుకుంటున్నామని తెలిపారు.

సంగారెడ్డి: జిల్లాలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజ్ పార్క్‌లో 7 కంపెనీలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశంలో మెడికల్ డివైజ్‌లను 78 శాతం ఇతర దేశాల నుండి దిగుబడి చేసుకుంటున్నామని తెలిపారు. జీవ ఓషధ రంగంలో తెలంగాణను హబ్ చేయాలని కృషి చేస్తున్నామన్నారు. అలాగే ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్టెంట్ తయారీ సంస్థ మెడికల్ డివైజ్ పార్క్‌లో నిర్మాణంలో ఉందన్నారు.