భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా పొంగింది: కేటీఆర్

ABN , First Publish Date - 2021-12-30T17:03:01+05:30 IST

గతేడాది అక్టోబర్ నెలలో భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా పొంగిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలంతా ఇబ్బందులు పడ్డారన్నారు.

భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా పొంగింది: కేటీఆర్

హైదరాబాద్: గతేడాది అక్టోబర్ నెలలో భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా పొంగిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలంతా ఇబ్బందులు పడ్డారన్నారు. అప్పుడు స్థానికులతో మాట్లాడానన్నారు. 12 కిలోమీటర్లు ఉండే ఈ నాలాకు రిటైనింగ్ వాల్ నిర్మించాలని కోరారు. రిటైనింగ్ వాల్ ఒక్కటే ఈ నాలా పొంగి ఇళ్లలోకి నీరు రాకుండా ఉండేందుకు పరిష్కారమని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసి హైదరాబాద్ నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని కోరామన్నారు. వెంటనే సీఎం ఓకే చెప్పి స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం రూపొందించినట్టు తెలిపారు. ఇందులో 858 కోట్లతో మొదటి దశ ప్రాజెక్టు పనులు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ కింద అన్ని జోన్లలో నాలాల విస్తరణ చేపడుతున్నామన్నారు. జీహెచ్ఎంసీ ఒక్కటే కాదు పక్కన ఉన్న మున్సిపాలిటీల్లో కూడా పనులు చేపడతామన్నారు. హుస్సేన్ సాగర్ నుంచి మూసీలో కలిసే దాకా 68 కోట్లతో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం వచ్చే వానాకాలం నాటికి అంటే అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని కేటీఆర్ సూచించారు.

Updated Date - 2021-12-30T17:03:01+05:30 IST