ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్థుడు: ఎమ్మెల్యే షకీల్ అహ్మద్

ABN , First Publish Date - 2021-01-20T17:42:21+05:30 IST

కేటీఆర్ ను సీఎం చేయాలనే అభిప్రాయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేటీఆర్ ను సీఎం చేస్తే తప్పేంటని నిన్న

ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్థుడు:  ఎమ్మెల్యే షకీల్ అహ్మద్

నిజామాబాద్ : కేటీఆర్ ను  సీఎం చేయాలనే అభిప్రాయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేటీఆర్ ను సీఎం చేస్తే తప్పేంటని నిన్న మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించగా, నేడు బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ దానికి మద్దతు పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ సమర్థుడని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ అన్నారు. బుధవారం బోధన్ లో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందని  ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 


వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్ అధ్యక్షతన జరగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కేటీఆర్ ను సీఎం చేయాలని రాష్ట్రంలోని యువత కోరుకుంటోందన్నారు. కేటీఆర్ సీఎం అయితే పార్టీలోని యువతకు పదవులు వస్తాయని సంకేతం ఇచ్చినట్టు అవుతోందన్నారు. కేటీఆర్  సీఎం అయ్యేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం ఇవ్వాలని ఎమ్మెల్యే షకీల్ కోరారు.  ఈ కార్యక్రమంలో పట్టణంలోని నాయకులు, కార్యకర్తలు,  పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-20T17:42:21+05:30 IST