బీజేపీ ఎంపీ మనిషా, పశువా?: కేటీఆర్

ABN , First Publish Date - 2021-12-08T23:29:53+05:30 IST

అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉందన్నారు. దేశానికి అధిక ఆదాయమిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణది 4వ స్థానమని తెలిపారు.

బీజేపీ ఎంపీ మనిషా, పశువా?: కేటీఆర్

హైదరాబాద్: అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉందన్నారు. దేశానికి అధిక ఆదాయమిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణది 4వ స్థానమని తెలిపారు. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర ఆదాయం లక్ష రూపాయలు ఎక్కువన్నారు. అలాగే వరి కొనుగోళ్లపై కేంద్రానికి ఒక జాతీయ విధానం ఉండాలన్నారు. బియ్యం స్మగ్లర్లు అంటున్న బీజేపీ ఎంపీ మనిషా, పశువా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలవి చిల్లర రాజకీయాలని ఆయన మండిపడ్డారు. ఒకరు ఢిల్లీకి గులాం, మరొకరు గుజరాత్‌కి గులాం అని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది టీఆర్ఎస్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. బీజేపీ ఏం చేసిందని ఉద్యమకారులంతా మీ పార్టీలోకి రావాలి? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలవి దివాన్ మాటలని విమర్శించారు. 

Updated Date - 2021-12-08T23:29:53+05:30 IST