బీజేపీ నిరుద్యోగ దీక్షపై కేటీఆర్ విమర్శలు సరికాదు: రాజాసింగ్
ABN , First Publish Date - 2021-12-27T02:48:08+05:30 IST
బీజేపీ నిరుద్యోగ దీక్షపై మంత్రి కేటీఆర్ విమర్శలు సరికాదని ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

హైదరాబాద్: బీజేపీ నిరుద్యోగ దీక్షపై మంత్రి కేటీఆర్ విమర్శలు సరికాదని ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులను కేటీఆర్ అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఏడేళ్లుగా ఉద్యోగాల పేరుతో ఊరిస్తున్నారే తప్ప నోటిఫికేషన్ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇవ్వాల్సిందిపోయి ఎదురుదాడి చేస్తారా? అని రాజాసింగ్ ప్రశ్నించారు.
బీజేపీ నేత బండి సంజయ్‌పై, మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. బండి సంజయ్‌ది నిరుద్యోగ దీక్ష కాదని.. సిగ్గులేని దీక్షని అన్నారు. ఆయన తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమేనని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో నిరుద్యోగ యువతకు ఏం చేసిందో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చారో లెక్క చెప్పే దమ్ముందా? అని కేటీఆర్ నిలదీశారు