కృష్ణపట్నం మందుపై రాద్ధాంతం తగదు: కాకాణి

ABN , First Publish Date - 2021-05-24T10:09:57+05:30 IST

కొవిడ్‌ నివారణకు ఆయుర్వేద మందును తయారు చేస్తున్న ఆనందయ్యపైన, మందుపైన రాద్ధాంతాలు, దుష్ప్రచారాలు మంచిది కాదని, ప్రజలను రెచ్చగొట్లే ప్రయత్నాలు చేయొద్దని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

కృష్ణపట్నం మందుపై రాద్ధాంతం తగదు: కాకాణి

నెల్లూరు(జడ్పీ)/చంద్రగిరి, మే 23: కొవిడ్‌ నివారణకు ఆయుర్వేద మందును తయారు చేస్తున్న ఆనందయ్యపైన, మందుపైన రాద్ధాంతాలు, దుష్ప్రచారాలు మంచిది కాదని, ప్రజలను రెచ్చగొట్లే ప్రయత్నాలు చేయొద్దని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆనందయ్యతో కలిసి కాకాణి ఆదివారం నెల్లూరులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఆనందయ్యను అరెస్టు చేశారని, ఆయన్ను కొంతమంది నిర్బంధించారని రకరకాల ప్రచారాలు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. అనుమతులు లభించిన వెంటనే మందు పంపిణీ చేస్తామని చెప్పారు. కాగా.. తననెవరూ నిర్బంధించలేదని, అరెస్టు చేయలేదని.. తాను స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉన్నానని ఆనందయ్య తెలిపారు.

Updated Date - 2021-05-24T10:09:57+05:30 IST