మెట్టు దిగిన కృష్ణా బోర్డు

ABN , First Publish Date - 2021-11-02T08:27:12+05:30 IST

కృష్ణా బోర్డు సబ్‌ కమిటీలో సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేకు చోటు కల్పించేది లేదని ప్రకటించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)..

మెట్టు దిగిన కృష్ణా బోర్డు

సీఎం ఓఎస్డీకి సబ్‌ కమిటీలో చోటు

హైదరాబాద్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బోర్డు సబ్‌ కమిటీలో సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేకు చోటు కల్పించేది లేదని ప్రకటించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ).. ఎట్టకేలకు మెట్టు దిగింది. సబ్‌ కమిటీలో అంతరాష్ట్ర విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ వి.మోహన్‌రావు స్థానంలో శ్రీధర్‌రావు దేశ్‌పాండేకు చోటు కల్పిస్తూ బోర్డు సబ్‌ కమిటీ కన్వీనర్‌/మెంబర్‌ సెక్రటరీ బి.రవికుమార్‌ పిళ్లై సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. నీటిపారుదల ఎస్‌ఈ అయిన శ్రీధర్‌రావు దేశ్‌పాండేను సబ్‌ కమిటీలో తీసుకోవాలని కృష్ణా, గోదావరి బోర్డులకు  తెలంగాణ ఇటీవలే లేఖ రాసింది. అయితే, ఆయన నియామకాన్ని తప్పుపడుతూ కృష్ణా బోర్డు ఇటీవలే తెలంగాణకు లేఖ రాసింది. చీఫ్‌ ఇంజనీర్‌ తత్సమాన స్థాయి అధికారులకే సబ్‌ కమిటీలో చోటు ఉంటుందని గుర్తు చేసింది. ఈ విషయమై స్పందించిన తెలంగాణ శ్రీధర్‌రావు దేశ్‌పాండే చీఫ్‌ ఇంజనీర్‌గా అదనపు బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారని, బోర్డు సమావేశానికి ముందే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ లేఖ రాసింది. దీన్ని పరిగణనలోకి తీసుకొన్న బోర్డు నామినేషన్‌కు అంగీకారం తెలిపింది. అయితే, గోదావరి బోర్డు మాత్రం ఇంకా ఏ నిర్ణయం వెలువరించలేదు.

Updated Date - 2021-11-02T08:27:12+05:30 IST