పండుగల వేళ జర జాగ్రత్త

ABN , First Publish Date - 2021-08-27T09:39:09+05:30 IST

పండుగల వేళ జర జాగ్రత్త

పండుగల వేళ జర జాగ్రత్త

వచ్చే సెప్టెంబరు, అక్టోబరు నెలలు కీలకం: కేంద్రం


న్యూఢిల్లీ, ఆగస్టు 26: ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ మధ్యలో ఉన్నామని.. వైరస్‌ నియంత్రణలో సెప్టెంబరు, అక్టోబరు నెలలు ముఖ్యమైనవని, రానున్న పండుగలను కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలని కేంద్రం సూచించింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సెకండ్‌ వేవ్‌ ఇంకా ముగియలేదని.. గతంలో ప్రతి పండుగ అనంతరం కేసులు పెరిగిన సంగతి మరువొద్దని రాజేశ్‌ భూషణ్‌ పేర్కొన్నారు. టీకా తీసుకున్నప్పటికీ మాస్క్‌ ధరించడం ముఖ్యమని స్పష్టం చేశారు.  దేశంలో 41 జిల్లాల్లో వారపు పాజిటివ్‌ రేటు 10పైనే ఉందని వెల్లడించారు.

Updated Date - 2021-08-27T09:39:09+05:30 IST