ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటాలి..

ABN , First Publish Date - 2021-07-25T05:10:32+05:30 IST

ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటాలి..

ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటాలి..

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

ఘనంగా మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

ఖిలా వరంగల్‌లో కోటి వృక్షార్చన


ఖిలా వరంగల్‌, జూలై 24: ప్రతీ ఇంట్లో మూడు మొక్కలను నాటి, వాటి ని సంరక్షించాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్‌ కోటలో శనివారం కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని తూర్పుఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంపీ జోగినపల్లి సంతో్‌షకుమార్‌ ఇచ్చిన పిలుపులో భాగంగా వరంగల్‌ తూర్పులో 10 వేల మొక్కలను నాటామన్నారు. యువనేత కేటీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రా న్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చారని, వరంగల్‌కు అనేక ఐటీ సంస్థలను తీసుకువచ్చారన్నారు. వరంగల్‌ నగరంలో అతిపెద్ద సూపర్‌మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులకు ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రారంభించారన్నారు. రానున్న కాలంలో వరంగల్‌ అన్నిరంగాలలో ముందంజలో ఉంటుందన్నారు. ముందుగా కేటీఆర్‌ జన్మదినం సందర్బంగా కేక్‌ కట్‌చేసి స్వీట్లను పంపిణీ చేశారు. నగర డిప్యూటీ మేయర్‌ రిజ్వానా షమీమ్‌-మసూద్‌, కార్పొరేటర్లు బైరబోయిన ఉమా-దామోదర్‌యాదవ్‌, బోగి సువర్ణ-సురేష్‌, వస్కుల బాబు, సోమిశెట్టి ప్రవీణ్‌, దిడ్డి కుమారస్వామి, గుండేటి నరేంద్రకుమార్‌, పోశాల పద్మ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T05:10:32+05:30 IST