కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించాలంటూ బీజేపీ నిరసన

ABN , First Publish Date - 2021-05-20T19:55:25+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా రోగులకు మెరుగైన వైద్యం కల్పించాలని రంగారెడ్డి జిల్లా ఆస్పత్రి వద్ద బీజేపీ నేతలు..

కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించాలంటూ బీజేపీ నిరసన

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా రోగులకు మెరుగైన వైద్యం కల్పించాలని రంగారెడ్డి జిల్లా ఆస్పత్రి వద్ద బీజేపీ నేతలు నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు ఏకైక ప్రభుత్వ ఆస్పత్రిగా ఉన్న కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కరోనా టెస్టింగ్ కిట్ల కొరతతోపాటు కోవిడ్ రోగులకు సరైన వైద్యం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఈ ఆస్పత్రిలో వందమంది రోగులకు చికిత్స అందించవచ్చునని, అయితే 30 మంది పేషెంట్లే ఉన్నారన్నారు. ఎందుకంటే ఆస్పత్రిలో సిబ్బంది, సదుపాయాల కొరత వల్ల ఎక్కువమందికి ట్రీట్‌మెంట్ ఇవ్వలేకపోతున్నారని అన్నారు. వ్యాక్సిన్లు కూడా ఇవ్వడంలేదని విమర్శించారు. టెస్టులు కూడా రోజుకు 250 మందికి మాత్రమే చేస్తున్నారని, పరీక్షలు పెంచాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-05-20T19:55:25+05:30 IST