మా మధ్య విభేదాలు లేవు: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-03-21T05:30:00+05:30 IST

మా అన్నదమ్ముల మధ్య విభేదాలు లేవని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టంచేశారు.

మా మధ్య విభేదాలు లేవు: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

నల్గొండ: మా అన్నదమ్ముల మధ్య విభేదాలు లేవని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టంచేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులతో ఓట్లు కొని సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. సాగర్‌లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. జానారెడ్డి చేసిన అభివృద్ధే నాగార్జున సాగర్‌లో ఆయన్ని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీజేఎస్ అధినేత కోదండరాం, తీన్మార్ మల్లన్న, బీజేపీ నేత రామచందర్‌రావు ఓడి గెలిచారని చెప్పారు.టీఆర్‌ఎస్‌ గెలిచి ప్రజల్లో మాత్రం ఓడిందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2021-03-21T05:30:00+05:30 IST