సాయుధ పోరాట యోధుడు ‘కొల్లు’ కన్నుమూత
ABN , First Publish Date - 2021-10-21T09:57:48+05:30 IST
సూర్యాపేట జిల్లాకు చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సాహితీవేత్త కొల్లు వరప్రసాదరావు (95) కన్నుమూశారు.
గరిడేపల్లి రూరల్/నడిగూడెం, అక్టోబరు 20 : సూర్యాపేట జిల్లాకు చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సాహితీవేత్త కొల్లు వరప్రసాదరావు (95) కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మునగాల మండలం జగన్నాధపురం వాస్తవ్యుడు. చివరివరకూ కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను పాటించారు. కుల వ్యవస్థ నిర్మూలనలో భాగంగా కొల్లు వరప్రసాదరావు మూడు దశాబ్దాల క్రితమే దళితుల పాడె మో శారు. ఇంట్లో పనిచేసే పాలేర్లకు వస్త్రాలు పెట్టి వారి కాళ్లకు దండం పెట్టారు. తన శరీరాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించాలని వరప్రసాదరావు 20ఏళ్ల కిందటే వీలునామా రాశారు. అంతేకాకుండా భార్య బొట్టు, పసుపు, కుంకుమలు తీయకుండా కర్మకాండలు చేయకుండా, నేటి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ప్రసాదరావు తన వీలునామాలో పే ర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కోరుకున్న విధంగా వరప్రసాదరావు మృతదేహాన్ని మమత మెడికల్ ఆస్పత్రికి అప్పగించారు.