గోదాముల్లో బియ్యం ఎక్కడికి పోయాయి?: కోదండరెడ్డి

ABN , First Publish Date - 2021-12-08T23:16:41+05:30 IST

వడ్ల కొనుగోలులో కేసీఆర్ బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారని జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

గోదాముల్లో బియ్యం ఎక్కడికి పోయాయి?: కోదండరెడ్డి

హైదరాబాద్: వడ్ల కొనుగోలులో కేసీఆర్ బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారని జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీల నాటకాలు రైతులు గమనించారని పేర్కొన్నారు. పార్లమెంట్ వదిలి గ్రామాలకు వెళతామని టీఆర్ఎస్ ఎంపీలు చెప్పడం బాధ్యతా రాహిత్యమన్నారు. టీఆరెఎస్ ప్రభుత్వం మిల్లర్లతో కుమ్ముక్కు అయ్యిందని ఆయన ఆరోపించారు. గోదాముల్లో మిస్ అయిన బియ్యం ఎక్కడికి పోయాయి? కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-08T23:16:41+05:30 IST