బలవంతపు భూసేకరణ ఆపాలి: కోదండరాం
ABN , First Publish Date - 2021-08-26T01:54:59+05:30 IST
బలవంతపు భూసేకరణను ప్రభుత్వం వెంటనే ఆపాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు.

సంగారెడ్డి: బలవంతపు భూసేకరణను ప్రభుత్వం వెంటనే ఆపాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలోని హుసెల్లి గ్రామానికి చెందిన మోహన్‌రెడ్డి రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులను కోదండరాం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిమ్జ్‌లో భూమి పోతుందని మోహాన్‌రెడ్డి ఏడేళ్ల నుంచి మానసిక వేదనకు గురయ్యాడన్నారు. నిమ్జ్‌లో భూములను కోల్పోతున్న రైతులు ఎవరు కూడా ఆవేదన చెందొద్దన్నారు. భూమిని నమ్ముకుని జీవిస్తున్న రైతులను కూలీలుగా మార్చే ప్రయత్నమే తప్ప ఇంకొక్కటి కాదని కోదండరాం పేర్కొన్నారు.